హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన వంశీకకు ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి గూడెపు వంశీక జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపిక కావడంతో గ్రామంలో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాదాస్ అనిల్ వంశీకను అభినందించి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.