హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక అధికారుల నియామకం

భూపాలపల్లి జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాల నేపథ్యంలో 13 మండలాలు, మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ రాహుల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు వ్యవసాయం, విద్యుత్, తాగునీరు, సాగునీరు, పశుసంపద, ప్రజారోగ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.