హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గ భవాని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం

ATP: గుత్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఎనిమిదో రోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. అమ్మవారిని దుర్గా భవాని దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.