NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ రైస్ మిల్లులో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రైస్ మిల్లు తాళాలు, సీసీ కెమెరాలు పగలగొట్టి 25 బియ్యం బస్తాలు చోరీ చేశారని మిల్లు యాజమాని ప్రభాకర్ వాపోయారు. సుమారు 50 వేలు నష్టం జరిగిందని తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైస్ మిల్లులో చోరీ 25 బస్తాలు అపాహరణ


