హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరదరాజ పెరుమాళ్ అలంకరణలో వాసవి మాత

KRNL: ఆదోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం అమ్మవారు శ్రీ వరదరాజ పెరుమాళ్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకొని భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.