హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దేవాలయాల భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి'

JN: జాఫర్‌ఘడ్ మండలంలోని దేవాలయాలు, మసీదులకు చెందిన భూములకు హద్దులు ఏర్పాటు చేసి, అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ కోరారు. నూతన ఎస్సై వినయ్ కుమార్‌ను బీజేపీ నాయకులు శాలువాతో సన్మానించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.