ASR: అనంతగిరి మండలంలోని ఎగువశోభ పంచాయతీ దండపాడు గ్రామంలో ఇవాళ అనంతగిరి ఎస్సై శంకర్రావు, పోలీసు, ఏపీఎస్పీ సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. ఎవరూ గొడవల్లో పాల్గొనవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దండపాడులో పోలీసుల కార్డన్ సెర్చ్


