హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీ సమస్యలపై సంఘటిత పోరాటం

MLG: ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ అధికారులు కందకాలు తవ్వడం ఆపాలని సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఏటూరునాగారంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కందకాలతో ఆదివాసీల జీవనాధారం దెబ్బతింటుందని అన్నారు. కొత్తపోడు కొట్టేది లేదు.. పాత పోడు వదిలేది లేదనే నినాదంతో ఆదివాసీలు సంఘటితంగా పోరాడాలన్నారు.