హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుమార్తెకు తండ్రి చివరి వాట్సాప్ సందేశం

BDK: భద్రాచలంలోని ఓ లాడ్జిలో గ్యాస్ గోదాం మేనేజర్ లక్ష్మీనారాయణ శనివారం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మేనేజర్ ప్రాణాలు తీసుకునే ముందు పెద్ద కుమార్తెకు వాట్సాప్ సందేశం పంపినట్లు సమాచారం. తల్లిని ఇద్దరూ కలిసి జాగ్రత్తగా చూసుకోవాలని, తనను క్షమించాలని సందేశంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.