హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి డివిజన్‌లో భారీ వర్షపాతం

GNTR: తెనాలి డివిజన్‌ పరిధిలో ఆదివారం ఉదయం వరకు మొత్తం 165.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. డివిజన్‌ సగటు వర్షపాతం 20.8 మి.మీ.గా ఉంది. తెనాలిలో అత్యధికంగా 57.2 మి.మీ, దుగ్గిరాలలో 23, పొన్నూరులో 21.4, కాకుమానులో 19.2, కొల్లిపరలో 18.4, మంగళగిరిలో 12.6, చేబ్రోలులో 11, తాడేపల్లిలో 2.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు డివిజన్‌ డిప్యూటీ సివిల్ సప్లాయ్ అధికారి తెలిపారు.