హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తడివాగు ప్రాజెక్టు తాజా నీటి వివరాలు ఇవే..!

ADB: తాంసీ మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం స్థాయి 277.30 మీటర్లగా ఉందని AEE హరీష్ ఆదివారం తెలియజేశారు. ప్రాజెక్ట్ సవరించిన ప్రస్తుత నీటి సామర్థ్యం 0.440 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అదే స్థాయిలో నీరు నిల్వ ఉందని వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలో ఇప్పటివరకు 519.40 మి.మీ వర్షపాతం నమోదైందని AEE హరీష్ పేర్కొన్నారు.