హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారు చీర అలంకరణలో అమ్మవారు

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. బేస్తవారిపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆదివారం బంగారు చీర ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఖరీదైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.