హైదరాబాద్: 28°C
తెలంగాణ

డైరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు బోనస్ అందజేత

KNR: కరీంనగర్ డైరీ నల్ల వెంకయ్యపల్లి గ్రామ అధ్యక్షులు పొద్దుటూరి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పాడి రైతులకు దసరా పండుగ కానుకగా ఆదివారం బోనస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన 34 మంది డైరీ సభ్యులు, పాడి రైతులందరికీ కలిపి మొత్తం రూ.61,300 బోనస్‌ను అందజేసినట్లు డైరీ సూపర్వైజర్ రెడ్డవేని వెంకటేష్ తెలిపారు.