హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో RTA సేవలు ఇక కొత్త కార్యాలయంలోనే!

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో నూతన ఆర్టీఏ కార్యాలయం శుక్రవారం ప్రారంభమైంది. జిల్లా రవాణా అధికారి ఇమ్రాన్ అహ్మద్ శనివారం ఈ విషయాన్ని తెలియజేశారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు తదితర రవాణా శాఖ సేవలను ప్రజలు ఈ నూతన కార్యాలయంలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.