హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో చికెన్ ధరలు ఇవే!

AKP: దేవి నవరాత్రుల ప్రభావంతో జిల్లాలో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. గత ఆదివారం రూ.1.20 లక్షల అమ్మకాలు చేసిన షాపులో ఈవారం రూ.60 వేలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం లైవ్ చికెన్ కిలో రూ.135, స్కిన్‌లెస్ రూ.260, స్కిన్‌తో రూ.240గా ఉన్నాయి. గతవారంతో పోలిస్తే ధరలు తగ్గినా, అమ్మకాలు మందగించాయని వ్యాపారులు తెలిపారు.