హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రాలయంలో మంటలు.. పరుగులు తీసిన జనం!

KRNL: మంత్రాలయం రామచంద్రనగర్ టవర్ ఏరియాలో శనివారం రాత్రి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన కాలనీవాసులు మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.