హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్షెట్టిపేటలో అసంపూర్తిగా సీసీ రహదారి

MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని 13వ వార్డులో తహసీల్దార్ కార్యాలయం మెయిన్ రోడ్డు నుంచి ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాల వరకు రూ.20 లక్షలతో సీసీ రహదారి నిర్మించారు. ఈ రోడ్డును జిల్లా పరిషత్ బాలుర పాఠశాల వరకు ఉన్న డబుల్ రోడ్డుకు కలపాల్సి ఉంది. మరో 30 మీటర్లు నిర్మించాల్సి ఉన్నా, పనులను అసంపూర్తిగా వదిలేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.