KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి ఫారం జవహర్ నవోదయ విద్యాలయం సమీపంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పరమాన్ దొడ్డికి చెందిన గొల్ల హనుమంతు కుమారుడు శివ(24) తీవ్రంగా గాయపడ్డాడు. ఎమ్మిగనూరు నుంచి బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు


