NRML: ఖానాపూర్ మండలం తర్లపాడు నుంచి పాత తర్లపాడు వెళ్లే రహదారి పక్కన మిషన్ భగీరథ ఎయిర్ వాల్వు వద్ద రక్షణ కంచె దెబ్బతింది. సిమెంట్ దిమ్మె ధ్వంసం కావడంతో ఇనుప కంచె ఊడి పక్కకు ఒరిగింది. దీంతో వాల్వు వద్ద రక్షణ లేకుండా పోయింది. అధికారులు స్పందించి కొత్తగా కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
మిషన్ భగీరథ వాల్వు వద్ద రక్షణ కంచె ధ్వంసం


