హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి కూటమి నేతలో కుదిరిన సయోధ్య

GNTR: తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కౌన్సిలర్ స్థానాల సీట్ల కేటాయింపు పూర్తయింది. మొత్తం 52 వార్డుల్లో టీడీపీకి 31, జనసేనకు 20, బీజేపీకి ఒక వార్డును కేటాయించారు. నాటకీయ పరిణామాల మధ్య ఆఖరి క్షణంలో ఈ పంపకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ మాత్రం అన్ని స్థానాల్లో సింగల్‌గా బరిలోకి దిగుతోంది. దీంతో మున్సిపల్ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది.