హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో రూ.2,500 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్

గుంటూరు జిల్లాలో భారీ పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. ప్రగతి గ్రూప్ సంస్థ దీనిని అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ఏకంగా రూ.2,500 కోట్లను ఆ సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. అమరావతిలో జరిగిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ పార్కు ద్వారా స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.