హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిడదవోలులో జనసేనలోకి చేరికలు

E.G: మంత్రి, ఎమ్మెల్యే కందుల దుర్గేష్ సమక్షంలో నిడదవోలు పట్టణం, మండల పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. రోటరీ క్లబ్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.