హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవుడుపల్లి పునరావాసంలో వసతుల కొరత

ASF: దేవుడుపల్లి గ్రామస్థుల పునరావాసం కోసం 14.6 ఎకరాల భూమి సేకరించి మురుగు కాలువలు, నీటి ట్యాంకు ఏర్పాటు చేశారు. అయితే అంతర్గత సీసీ రోడ్లు, పాఠశాల భవనం, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించలేదు. 110 మందికి నష్టపరిహారం అందించినా ప్లాట్లు కేటాయించలేదు. దీంతో గ్రామస్థులు శిథిలావస్థకు చేరిన ఇళ్లలోనే దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.