విశాఖ: జీవీఎంసీ ఎన్నికల్లో 120 వార్డుల సీట్ల పంపకంపై కూటమి నేతల మధ్య చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. టీడీపీకి 80, జనసేనకు 30, బీజేపీకి 10 వార్డులు కేటాయించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఏ పార్టీకి ఏ వార్డులు కేటాయించాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సామాజికవర్గ సమీకరణాలు, గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొలిక్కి కూటమి సీట్ల సర్దుబాటు!


