హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

NDL: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు శనివారం ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు ఉన్నారు.