హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహస్య సమాచారం లీక్.. కాంట్రాక్ట్ వర్కర్ అరెస్ట్

విశాఖ నౌకాదళానికి సంబంధించిన కీలక సమాచారాన్ని రహస్యంగా సేకరించి, బయటి వ్యక్తులకు చేరవేసిన కాంట్రాక్ట్ వర్కర్ నరేశ్‌పై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.