హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి ఐసీడీఎస్ ఇన్‌చార్జి సీడీపీవోగా సునీలత

NLR: ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఇన్‌చార్జి సీడీపీవోగా పి. సునీలత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆత్మకూరు సీడీపీవోగా పనిచేస్తున్న ఆమెకు ఉదయగిరి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంగన్‌వాడీ కేంద్రాలు సమయపాలన పాటించాలని, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని సకాలంలో అందించాలని ఆమె సూచించారు.