హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులపై కేసు

KNR: వీణవంక మండలం గన్ముకుల గ్రామ శివారులో శనివారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన గ్రామానికి చెందిన గాజుల సన్నీ (21), కనుకుంట్ల రుత్విక్ (20), గాజుల సిద్ధార్థ (19)పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. అనంతరం వారిని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు.