హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవు: MPDO

CTR: ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని MPDO శిరీష స్పష్టం చేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. విధులకు సెలవులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 21న ఉదయం 10గంటలకు నరహరిపేట జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయులకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు.