KNR: చిగురుమామిడి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ ఆకవరం భవాని తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకునేలా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. పండుగను ఐక్యత, ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
'బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు పూర్తి'


