KRNL: ఆదోనిలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మ దేవస్థానంలో ఏడవ రోజు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి అవ్వవారిని నెమలీకలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెమలీకలతో అమ్మవారికి విశేష అలంకరణ


