హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా, బతుకమ్మ ఏర్పాట్లపై కమిషనర్ పర్యవేక్షణ

​మెదక్ పట్టణంలోని బంగ్లా చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనం, బాలుర కళాశాల మైదానంలో దసరా సంబరాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ వై. నవీన్ పరిశీలించారు. పారిశుధ్యం, లైటింగ్, స్టేజ్ ఏర్పాట్లను సమీక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 5వ వార్డు జమ్మి చెట్టు వద్ద చేపడుతున్న శానిటేషన్, లైటింగ్ పనులను తనిఖీ చేసి వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు.