MDK: నర్సాపూర్ నియోజకవర్గంలోని కాగజ్మద్దూర్, నట్నాయపల్లి గ్రామాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత ఉత్సవాల్లో ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు అమ్మవారి దయ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే


