హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా గన్నవరం పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు గుణదల ఈఈ విశ్వేశ్వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మేఘనారోడ్డు, వేపగుంట, విజయామెడోస్, పెట్రోల్ బంకు తదితర పరిసరాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.