కృష్ణా: ఓ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఐలా భాగ్యరాజు(32) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన కానూరులోని ఓ కళాశాలలో పని చేస్తున్నారు. దసరా సెలవుల్లో శుక్రవారం రాత్రి కళాశాలకు వచ్చి నాలుగో అంతస్తు గదికి వెళ్లారు. శనివారం ఉదయం భవనం బయట తీవ్ర గాయాలతో కనిపించగా ఆసుపత్రిలో మృతి చెందారు. ఆత్మహత్యా, ప్రమాదమా అన్న కోణంలో పెనమలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అనుమానస్పదంగా వైస్ ప్రిన్సిపాల్ మృతి


