హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయిలో జిల్లా వాసి ప్రాజెక్ట్ ఎంపిక

కృష్ణా: ఎన్సీఈఆర్టీ 2026-27కు ఎంపిక చేసిన 20 వినూత్న ప్రాజెక్టుల్లో అంగలూరు డైట్ అధ్యాపకుడు పాకాల వినయ్ కుమార్ ప్రాజెక్ట్ ఎంపికైంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక ప్రాజెక్ట్ ఇదే. పాచికలతో భిన్నాల సమస్యలను తయారు చేయడం, పరిష్కరించడం అనే అంశంపై ఆయన ప్రాజెక్ట్ రూపొందించారు. దీనిని 2027 మేలో ఢిల్లీలోని ఎన్సీఈఆర్టీలో నివేదించాల్సి ఉంటుంది.