హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత నేత్రవైద్య శిబిరం

GNTR: జిల్లా అంధత్వ నివారణ సంస్థ, పచ్చల రామసుబ్బారావు జ్ఞాపకార్థం ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో ఈ నెల 18న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు పచ్చల శ్రీనివాసరావు తెలిపారు. శంకర కంటి ఆసుపత్రి సహకారంతో స్థానిక హిందూ ఎయిడెడ్ పాఠశాలలో ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.