హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఎఫెక్ట్‌.. పరీక్షలు వాయిదా..!

KDP: ఈ నెల 23 నుంచి నిర్వహించాల్సిన YVU LLB 3, 5వ సంవత్సరం (2, 4, 6, 8 సెమిస్టర్లు) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొ. టి. లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. మున్సిపల్, కార్పొరేషన్, ZP ఎన్నికల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.