SS: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు ఖాద్రీ నారసింహుడు 'శ్రీ సరస్వతి' అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానదాయకమైన ఈ రూపంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'సరస్వతి' అలంకారంలో నరసింహస్వామి దర్శనం


