హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ప్రకాశం: మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా శనివారం రాత్రి మార్కాపురం టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, రికార్డులను అప్‌డేట్‌ చేయాలని ఎస్‌ఐ విశ్వనాథరెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ, సీఐ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పాల్గొన్నారు.