హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనిగిరి ఛైర్మన్ అభ్యర్థిగా తిరుపతమ్మ

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా అచ్చాల తిరుపతమ్మను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మున్సిపాలిటీ పరిధిలోని కొత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు అచ్చాల రవి భార్య తిరుపతమ్మకు ఛైర్మన్ అభ్యర్థిగా అవకాశం లభించడంతో కొత్తూరులో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.