హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షంలోనూ శ్రీవారి గజవాహన సేవ

TPT: తిరుమలలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసినా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవ వైభవంగా సాగింది. వర్షం నేపథ్యంలో ఘటటోపం మధ్య శ్రీ మలయప్పస్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు తడుస్తూనే స్వామివారి వాహనసేవను తిలకించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.