హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా పర్యటనకు అరుణ్ బాబు రాక

సత్యసాయి: జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన పి.అరుణ్ బాబు అక్టోబర్ 18న జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పుట్టపర్తిలోని జిల్లా కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.