హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దాల లేసుల అలంకరణలో అమ్మవారి దర్శనం

ATP: గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ అమ్మవారి మూలమూర్తికి అద్దాల లేసులతో దివ్య పద్మావతి దేవిగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.