హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

విశాఖలో జీవీఎంసీ 120 వార్డులకు అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నారు. 79 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.