హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

23 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల స్వీకరణ

VZM: డెంకాడ మండల అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల నుంచి ఈ నెల 23 నుంచి 31 వరకు బాండ్లు స్వీకరించనున్నట్లు విశాఖ సీఐడీ డీఎస్పీ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. విజయనగరం కంటోన్మెంట్ పోలీస్ లైన్స్‌లోని సీఆర్‌పీఎఫ్ బ్యారక్‌కు ఒరిజినల్ బాండ్లు, కలర్ జిరాక్స్, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ, బ్యాంకుకు అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో రావాలన్నారు.