VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్థిగా జనసేన పట్టణ అధ్యక్షుడు రవ్వ నాని శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాని రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయన నామినేషన్తో నెల్లిమర్లలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. తదుపరి పరిణామాలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
నెల్లిమర్ల ఛైర్మన్ రెబల్ అభ్యర్థిగా నాని


