హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

మార్కాపురం జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు, ఎన్నికల సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు 24 గంటలు పనిచేస్తుందన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 9248702500కు ఫిర్యాదు చేయొచ్చు అని పేర్కొన్నారు.