ప్రకాశం: ఎన్నికల కోడ్ నేపథ్యంలో కంభం ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు పార్సెల్ సర్వీసుల్లో శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్యం, నగదు, నిషేధిత వస్తువుల రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు బెస్తవారిపేట మండలంలో పాత ఎక్సైజ్ కేసులకు సంబంధించి ఇద్దరు నిందితులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కంభం పార్సెల్ సర్వీసుల్లో తనిఖీలు


