హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాగంటి క్షేత్రంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో శనివారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. క్రిష్ణగిరి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు తలారి వెంకట్ రాముడు కుమారుని వివాహ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.